అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | యూఎస్, ఇరాన్‌ల మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలు వడ్డిస్తామన్న అమెరికా అధ్యక్షుడి హెచ్చరికల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రారంభంలోనే ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో సూచీలు పడిపోయాయి.
దీనికి తోడు రూపాయి విలువలో బలహీనత కొనసాగుతుండడం, నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ రోజు కావడంతో మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ (Sensex) 201 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 179 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 996 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 2 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడితో 296 పాయింట్లు పడిపోయింది. యూఎస్, భారత్‌ల మధ్య వాణిజ్య చర్చలపై ఆశావాదంతో చివరి గంటలో మార్కెట్‌లో (Markets) రికవరీ వచ్చింది. దీంతో కనిష్టాలనుంచి సూచీలు కోలుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 250 పాయింట్ల నష్టంతో 83,627 వద్ద, నిఫ్టీ 58 పాయింట్ల నష్టంతో 25,732 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market | మిశ్రమంగా సూచీలు..
బీఎస్‌ఈలో (BSE) ఐటీ ఇండెక్స్ 0.78 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.67 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.40 శాతం, మెటల్ ఇండెక్స్ 0.39 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.30 శాతం లాభపడ్డాయి. టెలికాం 1.18 శాతం, ఇండస్ట్రియల్ 1.09 శాతం, ఇన్‌ఫ్రా 0.85 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.67 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.63 శాతం, రియాలిటీ ఇండెక్స్ 0.56 శాతం, ఎనర్జీ 0.51 శాతం, సర్వీసెస్ 0.49 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.46 శాతం లాభపడగా.. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం నష్టపోయాయి.
Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 2,038 కంపెనీలు లాభపడగా 2,099 స్టాక్స్ నష్టపోయాయి. 190 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 69 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 232 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Market | Top gainers…
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో (BSE Sensex) 10 కంపెనీలు లాభపడగా.. 20 కంపెనీలు నష్టపోయాయి. ఎటర్నల్ 3.24 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.66 శాతం, టెక్ మహీంద్రా 1.49 శాతం, ఎస్‌బీఐ 1.32 శాతం, టీసీఎస్ 0.83 శాతం లాభపడ్డాయి.
Stock Market | Top losers..
ట్రెంట్ 3.39 శాతం, ఎల్‌టీ 3.25 శాతం, రిలయన్స్ 2.14 శాతం, ఇండిగో 1.95 శాతం, మారుతి 1.13 శాతం నష్టపోయాయి.