69
అక్షరటుడే, ఇందూరు: TPUS Nizamabad | తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) ఇందూరు క్యాలెండర్ మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆవిష్కరించారు. కలెక్టర్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం డీఈవో కార్యాలయంలో తపస్ టేబుల్ క్యాలెండర్ను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కిషన్ రెడ్డి, మధుసూదనాచారి, రాష్ట్ర సహాధ్యక్షుడు పాపగారి రామకృష్ణ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాండ్ల వరప్రసాద్, కర్నె శంకర్, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
