Taneira | పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

అక్షరటుడే, హైదరాబాద్: Taneira | టాటా మహిళల ఎత్నిక్ వేర్ బ్రాండ్ అయిన తనైరా Tata women’s ethnic wear brand Taneira, పండుగ సీజన్ కోసం ‘మియారా Miara: క్రాఫ్టెడ్ బై హ్యాండ్ Crafted by Hand, రూటెడ్ ఇన్ ప్యూరిటీ Rooted in Purity’ పేరుతో సరికొత్త కలెక్షన్‌ను విడుదల చేసింది. ఈ పండుగ సీజన్‌ festive season లో తమకు రెండు అంకెల వృద్ధి ఉంటుందని కంపెనీ ఆశిస్తోంది. ఈ ‘మియారా’ కలెక్షన్లో […]

అక్షరటుడే, హైదరాబాద్: Taneira | టాటా మహిళల ఎత్నిక్ వేర్ బ్రాండ్ అయిన తనైరా Tata women’s ethnic wear brand Taneira, పండుగ సీజన్ కోసం ‘మియారా Miara: క్రాఫ్టెడ్ బై హ్యాండ్ Crafted by Hand, రూటెడ్ ఇన్ ప్యూరిటీ Rooted in Purity’ పేరుతో సరికొత్త కలెక్షన్‌ను విడుదల చేసింది.

ఈ పండుగ సీజన్‌ festive season లో తమకు రెండు అంకెల వృద్ధి ఉంటుందని కంపెనీ ఆశిస్తోంది. ఈ ‘మియారా’ కలెక్షన్లో పట్టు, కాటన్ చీరలు ఉన్నాయి. వీటిని సంప్రదాయ హస్తకళ, ఆధునిక డిజైన్ల కలయికతో రూపొందించారు.

ఈ కలెక్షన్ స్పెషల్ అకేషన్స్‌కు బహుమతిగా లేదా వ్యక్తిగత ఆనందం కోసం ఎంచుకునే వారికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ కలెక్షన్ విడుదల సందర్భంగా, తనైరా ‘ది గిఫ్ట్ ఆఫ్ ప్యూర్ లవ్’ అనే ప్రచారాన్ని కూడా ప్రారంభించింది.

ఈ ప్రచారం పండుగ సీజన్‌లో ప్రేమకు చిహ్నంగా చీరను బహుమతిగా ఇవ్వడాన్ని తెలియజేస్తుంది. స్వచ్ఛమైన ప్రేమను బహుమతిగా ఇవ్వడం అనేది ఒక భావోద్వేగగా పేర్కొనవచ్చు.

Taneira | పండుగ ఆఫర్లు..

కస్టమర్ల కోసం తనైరా ప్రత్యేకమైన ఆఫర్లను ప్రవేశపెట్టింది. రూ. 10,000 కొనుగోలుపై రూ. 1,000 విలువైన వోచర్, రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలుపై 0.2 గ్రాముల తనిష్క్ బంగారు నాణెం లభిస్తుంది. ఈ ఆఫర్ అక్టోబరు 20, 2025 వరకు అందుబాటులో ఉంటుంది.

వీటితో పాటు, వినియోగదారులు తమ కలల చీరలను కొనుగోలు చేయడానికి వీలుగా ‘గోల్డెన్ కోకూన్ ప్లాన్’ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా సులభంగా తమకు నచ్చిన చీరను సొంతం చేసుకోవచ్చు. ‘మియారా’ కలెక్షన్‌లో చీరల ధరలు రూ. 6,499 నుంచి ప్రారంభమవుతాయి.

తనైరా సీఎస్ఎంఓ సోంప్రబ్ సింగ్ మాట్లాడుతూ.. తమకు ఈ పండుగ సీజన్‌లో రెండు అంకెల వృద్ధిని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కలెక్షన్ మహిళలకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని, ఇది కేవలం దుస్తులు కాకుండా, స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని తనైరా షోరూమ్‌లైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, పంజాగుట్ట, కొంపల్లి, గచ్చిబౌలిలోని లీ మెరిడియన్, సెరిలింగంపల్లి, రంగారెడ్డిలలో ఈ కొత్త ‘మియారా’ కలెక్షన్ అందుబాటులో ఉంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...