Dichpally
Dichpally | డబ్బులు తీసుకుని ఐపి పెట్టడం సరికాదు

అక్షరటుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని, ఐపీ (IP) పెట్టి పరారయ్యాడని బాధితులు వాపోయారు. ఈ మేరకు శనివారం డిచ్​పల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సదరు వ్యాపారి (businessman) దాదాపు 300 మంది రైతుల నుంచి రూ.20 కోట్ల వరకు డబ్బులు తీసుకుని, వాటిని తిరిగి ఇవ్వలేదన్నారు.

అంతేగాక ఆ డబ్బులతో విలాసాలకు ఖర్చు పెట్టడంతో పాటు నడిపల్లి శివార్లలో కన్వెన్షన్ హాల్ నిర్మించుకున్నారని ఆరోపించారు. తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమంటే ఐపీ పెట్టి పరారయ్యాడని వాపోయారు. సదరు ఫంక్షన్ హాల్​లో రూరల్ నియోజకవర్గ (rural constituency) ప్రజలు ఎవరూ శుభకార్యాలు చేయవద్దని, ఎవరైనా చేస్తే అడ్డుకుంటామని బాధితులు మీడియా ముఖంగా హెచ్చరించారు. తమకు సహకరించాలని వేడుకున్నారు. వ్యాపారి కుమారులు ఇప్పటికైనా తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, దీనిపై ఎందరో జీవితాలు ఆధారపడి ఉన్నాయన్నారు. నమ్మినవారిని మోసం చేయవద్దని కన్నీరు మున్నీరుగా విలపించారు.