అక్షరటుడే, డిచ్పల్లి : Telangana University | సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి (Professor Yadagiri) పేర్కొన్నారు. వర్సిటీలో సమాచార హక్కు చట్టం (Right to Information Act) సహాయాధికారి డాక్టర్ నీలిమ అధ్యక్షతన శుక్రవారం స.హ. చట్టం–2005పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ వర్సిటీ (Telangana University) విద్యార్థులకు సమాచారం అందించడంలో పారదర్శకత ప్రదర్శించాలని సూచించారు. సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని కోరడం పౌరుల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, లా కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్న రాణి, కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్ కుమార్ రెడ్డి, యూజీసీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ ఆంజనేయులు, జూనియర్ అసిస్టెంట్ హరీష్, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందితోపాటు పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.