అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CI Suspended | విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై వేటు వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని (Hyderabad City) కుల్సుంపుర సీఐ సునీల్‌పై నగర సీపీ సజ్జనార్ (CP Sajjanar) వేటు వేశారు.
సీఐ సునీల్ ఓ కేసులో నిందితుల పేర్లు మార్చాడు. నిందితులకు అనుకూలంగా వ్యవహరించాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులు అంతర్గత విచారణ చేపట్టారు. డబ్బులు తీసుకొని నిందితుల పేర్లు మార్చారని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
CI Suspended | కఠిన చర్యలు
నగర సీపీ సజ్జనార్ సిబ్బంది క్రమశిక్షణపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. నవంబర్‌లో టప్పాచబుత్రా సీఐ అభిలాష్‌ను (CI Abhilash) సస్పెండ్ చేశారు. రోడ్డు పక్కన కూర్చున్న కొందరికి కానిస్టేబుల్ వెళ్లిపోవాలని సూచించారు. అయితే వారు వెళ్లకుండా కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని కానిస్టేబుల్ సీఐ అభిలాష్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఆయన ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వేటు వేశారు. అలాగే ఇటీవల ఓ నిందితుడి ఇంట్లో రోలాక్స్ వాచ్ కొట్టేసిన కానిస్టేబుల్‌ను సైతం సస్పెండ్ చేశారు. మెహదీపట్నం ఠాణాలోని లాకర్ నుంచి ఖరీదైన ఫోన్‌ను చోరీ చేసిన పోలీస్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.