HomeUncategorizedVenky Atluri | మరోసారి త‌మిళ హీరోతోనే వెంకీ అట్లూరి.. గ్రాండ్‌గా పూజా కార్య‌క్ర‌మాలు

Venky Atluri | మరోసారి త‌మిళ హీరోతోనే వెంకీ అట్లూరి.. గ్రాండ్‌గా పూజా కార్య‌క్ర‌మాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Venky Atluri | ప్రేమ క‌థ‌ల‌తో పాటు విభిన్న క‌థాంశాల‌తో సినిమాలు తెర‌కెక్కించి ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి(Venky Atluri). తొలి ప్రేమ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్న వెంకీ అఖిల్ Akhil తో చేసిన మిస్టర్ మజ్ను, నితిన్​తో చేసిన రంగ్ దే సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని అందుకోలేకపోయాయి. ఈ రెండు సినిమాల ఫలితాల రూట్ మార్చాడు ఈ దర్శకుడు. టాలీవుడ్ హీరోల‌ని ప‌క్క‌న పెట్టి కోలీవుడ్ హీరోల‌తో సినిమాలు చేస్తున్నాడు. తమిళ్ స్టార్ హీరో ధనుష్‌తో చేసిన ‘సార్’, మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ మంచి హిట్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాను మరో తమిళ్ హీరోతో అనౌన్స్ చేశాడు వెంకీ.

Venky Atluri | త‌మిళ హీరోల‌తోనే..

గత కొద్దిరోజులుగా వెంకీ అట్లూరి-సూర్య Suriya కాంబినేషన్ లో సినిమా రాబోతుందని గుసగుసలు వినిపిస్తుండగా ఈరోజు అఫిషియల్​గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. సోమ‌వారం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో(Ramanaidu Studio)లో జ‌రిగిన‌ ఈ లాంచింగ్ కార్య‌క్ర‌మానికి చిత్రబృందం హాజ‌రైంది. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇత‌ర నటీనటులు, మిగ‌తా యూనిట్‌ వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ ప్రాజెక్టును సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో క‌లిసి ప్ర‌ముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పూజా కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. ఇక ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు.. హీరోయిన్​గా ఫిక్స్ అయ్యింది. అలానే జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. గతంలో వీరి కాంబినేషన్​లో వచ్చిన ఆకాశమే నీ హద్దురా భారీ విజయాన్ని దక్కించుకుంది. సూర్య రీసెంట్‌గా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన రెట్రో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ చిత్రం అంచనాలను అందుకోకపోవడంతో ఇప్పుడు సూర్య త‌న ఆశ‌ల‌న్నీ వెంకీపైనే పెట్టుకున్నారు. మ‌రి వ‌ర‌స హిట్స్‌తో దూసుకుపోతున్న వెంకీ అట్లూరి.. సూర్య‌కి మంచి హిట్ అందిస్తాడా అనేది చూడాలి.