HomeUncategorizedJustice Verma | జ‌స్టిస్ వ‌ర్మ పిటిష‌న్‌పై సుప్రీం విచార‌ణ‌.. ప్ర‌త్యేక బెంచ్ ఏర్పాటుకు అంగీకారం

Justice Verma | జ‌స్టిస్ వ‌ర్మ పిటిష‌న్‌పై సుప్రీం విచార‌ణ‌.. ప్ర‌త్యేక బెంచ్ ఏర్పాటుకు అంగీకారం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Justice Verma | అభిశంస‌న‌ను ఎదుర్కొంటున్న జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచార‌ణ‌కు స్వీక‌రించింది. పిటిష‌న్‌ను విచారించడానికి ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. నగదు అక్రమాల కేసులో అంతర్గత విచారణ కమిటీ త‌న వాద‌న‌ను విన‌కుండా దోషిగా తేల్చ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ జ‌స్టిస్ వ‌ర్మ ఇటీవ‌ల సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిష‌న్ వేశారు. అలాగే, త‌న‌ను తొల‌గించాల‌ని గ‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి సంజీవ్ ఖ‌న్నా(Chief Justice Sanjiv Khanna) చేసిన సిఫార‌సును ర‌ద్దు చేయాల‌ని, పార్ల‌మెంట్‌లో అభిశంస‌న‌ను అడ్డుకోవాల‌ని కోరారు.

Justice Verma | స‌త్వ‌ర‌మే విచారించాలి..

జ‌స్టిస్ వ‌ర్మ‌(Justice Verma) ను తొల‌గించేందుకు పార్ల‌మెంట్ లో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న త‌రుణంలో వీలైనంత త్వ‌ర‌గా ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు చేప‌ట్టాల‌ని వర్మ తరపున హాజ‌రైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్(Senior Advocate Kapil Sibal) ధ‌ర్మాస‌నాన్ని కోరారు. జస్టిస్ వర్మ తొలగింపుకు అప్పటి CJI చేసిన సిఫార్సుకు సంబంధించి వేసిన ఈ పిటిషన్ ను అంగీక‌రించాల‌ని జస్టిస్ వర్మ కోరారు. వ‌ర్మ తొలగింపుకు సంబంధించి కొన్ని రాజ్యాంగ సమస్యలను లేవనెత్తామని, వీలైనంత త్వరగా దీనిని లిస్టింగ్ చేయాలని అభ్యర్థించ‌గా, కోర్టు అగీక‌రించింది.

Justice Verma | బెంచ్ ఏర్పాటు చేస్తామ‌న్న సీజేఐ..

క‌పిల్ సిబ‌ల్ విజ్ఞ‌ప్తికి స్పందించిన చీఫ్ జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్(Chief Justice BR Gavai) విచార‌ణ‌కు బెంచ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియలో తాను కూడా ఒక భాగమైనందున ఈ విషయాన్ని తన ముందు జాబితా చేయకపోవచ్చని స్పష్టం చేశారు. ఈ వ్య‌వ‌హారంపై విచారణ జరిపి బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. CJI నేతృత్వంలోని ధర్మాసనంలో న్యాయమూర్తులు K వినోద్ చంద్రన్, జోయ్‌మల్య బాగ్చి కూడా ఉన్నారు. ఈ విషయాన్ని తక్షణ జాబితా కోసం బెంచ్ ముందు అత్యవసరంగా ప్రస్తావించారు.

Must Read
Related News