Supreme Court | ఈడీకి తలంటిన సుప్రీంకోర్టు.. ఆధారాలు లేకుండా అరెస్టు చేయ‌డంపై ఆగ్ర‌హం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Supreme Court | ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్ట‌రేట్ (ఈడీ) Enforcement Directorate (ED) తీరుపై అత్యున్న‌త న్యాయ‌స్థానం Supreme Court సోమ‌వారం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టులు arrest చేయ‌డం ఆనవాయితీగా మారింద‌ని వ్యాఖ్యానించింది. ఎవిడెన్స్‌లు without evidence లేకుండానే త‌ప్పుడు కేసులు పెడుతున్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ప్ర‌తీ స్కామ్‌లోనూ every scam ఈడీ ED తీరు ఇలానే ఉంద‌ని త‌లంటింది. ఛత్తీస్‌గ‌డ్‌లో Chhattisgarh మ‌ద్యం కుంభ‌కోణం కేసులో […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Supreme Court | ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్ట‌రేట్ (ఈడీ) Enforcement Directorate (ED) తీరుపై అత్యున్న‌త న్యాయ‌స్థానం Supreme Court సోమ‌వారం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టులు arrest చేయ‌డం ఆనవాయితీగా మారింద‌ని వ్యాఖ్యానించింది. ఎవిడెన్స్‌లు without evidence లేకుండానే త‌ప్పుడు కేసులు పెడుతున్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ప్ర‌తీ స్కామ్‌లోనూ every scam ఈడీ ED తీరు ఇలానే ఉంద‌ని త‌లంటింది.

ఛత్తీస్‌గ‌డ్‌లో Chhattisgarh మ‌ద్యం కుంభ‌కోణం కేసులో నిందితుడు దాఖ‌లు చేసిన బెయిల్ పిటిష‌న్‌పై bail petition సుప్రీంకోర్టు Supreme Court సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. 2019 నుంచి 2022 మధ్య  ఛత్తీస్‌గ‌ఢ్‌లో భూపేశ్ బాఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ Congress government హయాంలో జ‌రిగిన మద్యం liquor అమ్మకాలలో భారీ కుంభ‌కోణం జ‌రిగింద‌న్న ఆరోపణలు రావ‌డంతో ఈడీ ఎంట‌రైంది.

భూపేశ్ బాఘేల్ ప్రభుత్వ హయాంలో రూ.2,000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ Enforcement Directorate ఆరోపించింది. ఈ అక్రమాల వెనుక రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు senior state government officials, ప్రైవేట్ సంస్థలు private companies, రాజకీయ నేత‌ల political leaders సిండికేట్ ఉంద‌ని తెలిపింది. ఇందులో మనీలాండరింగ్ కూడా జ‌రిగింద‌ని పేర్కొంది.

Supreme Court | ఆధారాలేవి?

ఈ కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్‌పై విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు Supreme Court ఈడీపై ED ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆధారాలు లేకుండా అరెస్టులు చేయ‌డంపై జస్టిస్ ఉజ్జల్ భుయాన్ Justice Ujjal Bhuyan, జ‌స్టిస్ ఓకాతో Justice Oka కూడిన ధ‌ర్మాస‌నం మండిప‌డింది. “మేము ఎన్నో ఈడీ కేసులు ED cases చూస్తున్నాం. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం అల‌వాటైంద‌ని” జస్టిస్ AS ఓకా వ్యాఖ్యానించారు. “మేము అనేక ఈడీ కేసులను ED cases చూశాము. ED ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తోంది. ఇది ఒక నమూనాగా మారింది” అని తెలిపారు. నిందితుడు అక్ర‌మంగా illegally రూ.40 కోట్లు సంపాదించాడని ఈడీ ED ఆరోపించిందని గుర్తు చేసిన‌ జస్టిస్ ఓకా Justice Oka.. ఆ డ‌బ్బులు ఎటు పోయాయ‌ని ప్ర‌శ్నించారు. “ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో మీరు చెప్పలేరు, ఈ వ్యక్తికి, ఏ కంపెనీకి మధ్య ఎటువంటి సంబంధాన్ని మీరు చూపించలేరు” అని మండిప‌డ్డారు.

Supreme Court | ఛత్తీస్‌గ‌డ్ ప్ర‌భుత్వంపైనా ఆగ్ర‌హం

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంపై Chhattisgarh government సుప్రీం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నిందితుడిని accuse ఎంతకాలం జైలులో ఉంచుతార‌ని ప్ర‌శ్నించింది. “దర్యాప్తు దాని స్వంత వేగంతో సాగుతుంది. మూడు ఛార్జిషీట్లు charge sheets దాఖలయ్యాయి. అయినా మీరు ఆ వ్యక్తిని కస్టడీలో custod ఉంచడం ద్వారా వాస్తవంగా శిక్ష విధిస్తున్నారు. మీరు ఈ ప్రక్రియను శిక్షగా మార్చారు. ఇది ఉగ్రవాద లేదా ట్రిపుల్ మర్డర్ కేసు కాదు” అని బెంచ్ వ్యాఖ్యానించింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...