అక్షరటుడే, న్యూఢిల్లీ: Rail Kaushal Vikas Yojana : దేశంలో ఉద్యోగ అవకాశాలు కల్పించి, నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు రైల్వేశాఖ ‘రైల్ కౌశల్ వికాస్ యోజన’ను తీసుకొచ్చింది. ఈ పథకం కింద నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి, రైల్వేలో ఉద్యోగాలు పొందేలా చర్యలు తీసుకుంటోంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి రైల్వేలోని పలు విభాగాలలో శిక్షణ ఇస్తారు. తర్వాత సర్టిఫికేట్ ప్రదానం చేస్తారు. దీని ద్వారా రైల్వేశాఖలో ఉద్యోగం పొందొచ్చు.
Rail Kaushal Vikas Yojana : శిక్షణ ఇందులోనే..
రైల్ కౌశల్ వికాస్ యోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి రైల్వేలోని మెకానిక్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ కార్పొరేట్, ఎలక్ట్రికల్ వెల్డింగ్, ఇన్ స్ట్రూమెంటేషన్, ఐటీఐ సంబంధిత విభాగాల్లో శిక్షణ ఉంటుంది.
Rail Kaushal Vikas Yojana : దరఖాస్తు ఇలా..
మినిమం పదో తరగతి పాస్ అవ్వాలి. వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వారు అర్హులు. దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల ఆధార్ నంబరు, పదో తరగతి మెమో, సెల్ఫోన్ నంబరు, బర్త్ సర్టిఫికేట్, ఈమెయిల్ ఐడీ, పాస్ పోర్టు సైజు ఫొటో కావాలి. నేరుగా రైల్ కౌశల్ వికాస్ యోజన అధికారిక వెబ్ సైట్ (https://railkvy.indianrailways.gov.in/) లో దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్ కౌశల్ వికాస్ యోజన ద్వారా ఇప్పటి వరకు 50 వేలకు పైగా నిరుద్యోగులు శిక్షణ తీసుకున్నారు. వీరిలో దాదాపు అందరు కూడా రైల్వే ఉద్యోగాలు పొందినట్లు చెబుతున్నారు.