అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Muthyala Sunil Reddy | జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ (Balkonda Constituency) ఇన్‌ఛార్జి ముత్యాల సునీల్‌రెడ్డి స్పందించారు. రెండు మూడు రోజుల్లో సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.
ఆరెంజ్ ట్రావెల్స్ (Orange Travels) వ్యవహారంలో సునీల్‌రెడ్డి రూ.28 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు డీజీజీఐ అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ప్రటకన విడుదల చేశారు. ప్రజా జీవితంలో ఉన్న తాను ఆరెంట్ ట్రావెల్స్ సంస్థపై జరుగుతున్న విచారణపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
Muthyala Sunil Reddy | అదనంగా కట్టాలని..
ఆరెంట్ ట్రావెల్స్‌లో ప్రతి ఏటా యథావిధిగా నడుస్తున్న బస్సులపై 5శాతం జీఎస్టీ కడుతున్నట్లు సునీల్‌రెడ్డి తెలిపారు. కానీ జీఎస్టీ అధికారులు (GST Officers) దానిని 12శాతానికి పెంచి అదనంగా రూ.24 కోట్లు కట్టాలని సంస్థపై ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై విచారణ జరుపుతున్నారని తెలిపారు. ఎన్నో కష్టాలను అధిగమించి నిత్యం ప్రజా సేవలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.