Tamil Film Industry | రిస్కీ స్టంట్.. కారు మూడు ప‌ల్టీలు కొట్ట‌డంతో షూటింగ్‌లోనే స్టంట్ మాస్టర్ దుర్మరణం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Film Industry | త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌(Tamil Film Industry)లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు ఓ సినీ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆర్య హీరోగా, పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కోసం జులై 13వ తేదీ (ఆదివారం) ఉదయం జరిగిన షూటింగ్ లో భాగంగా కార్ స్టంట్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఆయన ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటనతో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Film Industry | త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌(Tamil Film Industry)లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు ఓ సినీ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆర్య హీరోగా, పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కోసం జులై 13వ తేదీ (ఆదివారం) ఉదయం జరిగిన షూటింగ్ లో భాగంగా కార్ స్టంట్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఆయన ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటనతో కోలీవుడ్ మొత్తం షాక్‌కి గురైంది. స్టంట్ మాస్టర్ రాజు (Stunt Master Raju) అనేక ప్రముఖ తమిళ, తెలుగు సినిమాల్లో పనిచేశారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

Tamil Film Industry | ఘోర ప్ర‌మాదం..

ఈ ఘటనపై నటుడు విశాల్ (Hero Vishal) తీవ్రంగా స్పందించారు. రాజుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, భావోద్వేగానికి లోనయ్యారు. షూటింగ్‌లో కార్ స్టంట్ చేస్తూ మాస్టర్ రాజు మృతి చెందాడన్న వార్త నన్ను ఎంత‌గానో కలచివేసింది. ఆయన ఇక మన మధ్య లేరన్న విషయం జీర్ణించుకోవడం చాలా కష్టం. చాలా సినిమాల్లో ఆయనతో పనిచేశాను. చాలా ధైర్యంగా, డెడ్‌లీ స్టంట్లు చేస్తుంటాడు. ఒక గొప్ప మిత్రుని, సహచరుణ్ని కోల్పోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి అండగా ఉంటాను అని ట్వీట్ చేశారు.

ఇంకా ఫైట్స్ మాస్టర్ సిల్వ(Fight Master Silva) కూడా తన ట్వీట్‌లో.. ఒక గొప్ప స్టంట్ ఆర్టిస్ట్‌ను కోల్పోయాం. స్టంట్ యూనియ‌న్‌కి నిజంగా ఇది తీరని లోటు. రాజు లాంటి డెడికేటెడ్ ఆర్టిస్ట్ లేని లోటు ఎన్నటికీ తీరదు, అంటూ సంతాపం వ్యక్తం చేశారు. అయితే స్టంట్ మాస్టర్ రాజు మరణంపై అటు హీరో ఆర్య కానీ, డైరెక్టర్ పా. రంజిత్ (Director Pa. Ranjith) కానీ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించకపోవడం గమనార్హం. స్టంట్స్ పట్ల అపారమైన అభిరుచి, నిబద్ధత ఉన్న రాజు మృతి సినీప‌రిశ్ర‌మ‌కి పెద్ద దెబ్బే అంటున్నారు. రాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ అభిమానులు, సెలబ్రిటీలు ప్రార్థిస్తున్నారు.

Related articles

IAS Transfers Telangana | రాష్ట్రంలో భారీగా ఐఏఎస్​ అధికారుల బదిలీలు

రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్​ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 45 మందికి స్థానచలనం కలిగిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

Feb 26 Gold Prices | మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం.. వెండి ధ‌ర‌ ఎంతంటే!

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 26 Gold Prices | భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా వాణిజ్య అనిశ్చితుల ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో...

Virosh Wedding Celebrations | మ‌రి కొద్ది గంట‌ల‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక‌ల వివాహం… ‘నో మొబైల్’ రూల్‌తో ప్రైవేట్ వెడ్డింగ్

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Virosh Wedding Celebrations | టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ–రష్మిక మందన్నాల వివాహం ఫిబ్రవరి 26 ఉదయం 10.10 గంటలకు ఉద‌య్‌పూర్‌లో...

Feb 26 Zodiac signs | ఆడవారితో మగవారికి.. మగవారితో ఆడవారికి వ్యాపారంలో అనుకూలం.. ఈ రాశుల వారికి తిరుగులేని లాభాలు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Feb 26 Zodiac signs | గ్రహాలు, నక్షత్రాల స్తితిగతుల వల్ల ఈ రోజు (గురువారం, ఫిబ్రవరి 26) పలు horoscope...