అక్షరటుడే, పెద్దకొడప్గల్ : MLA Laxmi Kantha Rao | విద్యార్థుల ప్రతిభను వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు (MLA Laxmi Kantha Rao) పేర్కొన్నారు. పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Zilla Parishad High School)లో అదనపు తరగతి గదులను మంగళవారం ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీఎంశ్రీ రూ.54 లక్షల నిధులతో తరగతి గదుల నిర్మాణం చేపట్టామన్నారు. పాఠశాలల్లో 378 విద్యార్థులు చదువుకుంటుండడం అభినందనీయమన్నారు. జుక్కల్ నియోజకవర్గం (Jukkal Constituency)లో విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేశామని పేర్కొన్నారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. నేటితరంలో టెక్నాలజీ ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థుల పాఠాలు బోధించాలన్నారు. విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో ఎల్లప్పుడూ తాను ముందుంటానని ఆయన స్పష్టం చేశారు.
