Homeజిల్లాలుకామారెడ్డిGandhari | విద్యార్థులకు ప్రథమ చికిత్సపై అవగాహన ఉండాలి

Gandhari | విద్యార్థులకు ప్రథమ చికిత్సపై అవగాహన ఉండాలి

విద్యార్థులకు ప్రథమ చికిత్సపై అవగాహన ఉండాలని ఏఎంవీఐలు మధుకర్, స్నిగ్ధ, శ్రవణ్​లు పేర్కొన్నారు. గాంధారి ఏకలవ్య మోడల్ స్కూల్​లో రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, గాంధారి: Gandhari | విద్యార్థులకు ప్రథమ చికిత్సపై (first aid) అవగాహన ఉండాలని సహాయక మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్లు మధుకర్, స్నిగ్ధ, శ్రవణ్​లు పేర్కొన్నారు.

మండలంలోని ఏకలవ్య మోడల్ స్కూల్​లో (Ekalavya Model School) సోమవారం రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి విద్యార్థి ప్రథమ చికిత్సపై అవగాహన కలిగి ఉండాలని.. రోడ్డు ప్రమాదాల్లో గోల్డెన్ అవర్స్ ప్రాముఖ్యతను వివరించారు.

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. తోటి విద్యార్థులు ఎవరైనా మాదకద్రవ్యాలకు బానిసలైనట్లుగా తెలిస్తే వెంటనే అధ్యాపకులకు తెలియజేయాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపాల్​ సురేష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Must Read
Related News