అక్షరటుడే, బోధన్: Wrestling competitions | మండలంలోని అమ్దాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు (Amdapur ZPHS Students) జాతీయస్థాయి కుస్తీ పోటీలకు ఎంపికయ్యారు.
పాఠశాలకు చెందిన రిజ్వాన్ అనే విద్యార్థి ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి కుస్తీలో బంగారు పతకం (gold medal) సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యాడని..అలాగే విద్యార్థిని వైష్ణవి వెండి పతకం (silver medal) సాధించి తాను సైతం జాతీయపోటీలకు సెలెక్ట్ అయిందని హెచ్ఎం సూర్యకుమార్ తెలిపారు. ఈ మేరకు వీరిరువురిని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) సోమవారం సన్మానించారు. జాతీయస్థాయిలో ప్రతిభచూపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీ సునీత పాల్గొన్నారు.
