Homeజిల్లాలుకామారెడ్డిDrug Prevention | మాదక ద్రవ్యాల నివారణపై విద్యార్థుల ప్రతిజ్ఞ

Drug Prevention | మాదక ద్రవ్యాల నివారణపై విద్యార్థుల ప్రతిజ్ఞ

మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. మాదక ద్రవ్యాల నివారణకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు/ఎల్లారెడ్డి : Drug Prevention | మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులది కీలకపాత్ర అని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Giriraj Government Degree College) ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. మూడో టౌన్ పోలీస్ స్టేషన్ (Three Town Police Station) ఆధ్వర్యంలో మంగళవారం మాదకద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. క్రమశిక్షణతో మెలగాలని.. జీవనశైలిని చక్కగా ఏర్పరచుకోవాలన్నారు. తమ కళాశాలలో మాదక ద్రవ్యాల నివారణ కమిటీ ఎప్పటికప్పుడు విద్యార్థులను చైతన్యం చేస్తుందన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యుడు డాక్టర్ రామస్వామి, వైస్ ప్రిన్సిపల్ రంగరత్నం, ఐక్యూ ఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, వీఆర్వో డాక్టర్ దండు స్వామి, రమేశ్​ గౌడ్, షేక్ చాంద్, పూర్ణ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Drug Prevention | ఎల్లారెడ్డిలో..

ఎల్లారెడ్డి (Yellareddy) పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, సిబ్బంది మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. కళాశాల విద్య కమిషనర్ (College Education Commissioner) ఆదేశాల మేరకు ఈరోజు కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. తాము మాదకద్రవ్యాల జోలికి పోమని, తమ పరిసరాల్లో మాదకద్రవ్యాల వినియోగం జరిగితే పోలీసు యంత్రాంగానికి సమాచారం ఇచ్చి.. సమాజా రక్షణకు తోడ్పడుతామని వారు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వాడడం వల్ల ఏర్పడే దుష్ఫలితాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రకాంత్, కళాశాల మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమన్వయకర్త డాక్టర్ శంకరయ్య, అధ్యాపకులు శివకుమార్, అమరేశం ప్రభాకర్ రావు, డాక్టర్ అరుణ్ కుమార్, నాగానిక, ఎన్​ఎస్​ఎస్​ యూనిట్–1 చంద్రకాంత్, రాణి, సంతోష్, డాక్టర్ గంగారెడ్డి, డాక్టర్ సిద్దు రాజు, మహమూద్, మోయిన్, స్వప్న, సురేష్ రెడ్డి, రాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.