Homeజిల్లాలుకామారెడ్డిCyber Crime | సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

Cyber Crime | సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

ఎల్లారెడ్డి మోడల్​ జూనియర్​ కళాశాలలో విద్యార్థులకు సైబర్​ నేరాలపై అవగాహన కల్పించారు. ఎల్లారెడ్డి ఎస్సై మహేశ్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Cyber Crime | మండల కేంద్రంలోని మోడల్​ జూనియర్​ కళాశాలలో (Model Junior College) విద్యార్థులకు సైబర్​ నేరాలపై అవగాహన కల్పించారు. ఎల్లారెడ్డి ఎస్సై మహేశ్​ ఆధ్వర్యంలో ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra) ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఫోన్లలో అనవసరమైన యాప్​లను డౌన్​లోడ్​ చేయవద్దని సూచించారు. ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని, సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోవద్దన్నారు. సైబర్​ నేరానికి గురయితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్​ 1930, లేదా ఎల్లారెడ్డి షీటీం సభ్యులు సుప్రజ టోల్ ఫ్రీ నంబర్​ 8712686094ను సంప్రదించాలని సూచించారు.

అలాగే సైబర్​ నేరాలు, ఉమెన్​ ట్రాఫికింగ్​పై పోలీస్​ కళాజాత బృందం సభ్యులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్​ఛార్జి హెడ్​ కానిస్టేబుల్​ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ శేషారావు, కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు, కళాశాల ప్రిన్సిపాల్ గాంధీ, ఉపాధ్యాయులు జహంగీర్, ప్రియదర్శిని, లక్ష్మణ్, రాజశేఖర్, బల్వంత్ రావు, విద్యారమణ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News