Homeజిల్లాలునిజామాబాద్​Kammarpally | ఇంగ్లిష్​ టాలెంట్​ టెస్ట్​లో విద్యార్థుల ప్రతిభ

Kammarpally | ఇంగ్లిష్​ టాలెంట్​ టెస్ట్​లో విద్యార్థుల ప్రతిభ

కమ్మర్​పల్లి మండల ఇంగ్లిష్​ ఉపాధ్యాయుల అసోసియేషన్​ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఎమ్మార్సీ భవన్​లో ఇంగ్లిష్​ భాషపై విద్యార్థులకు టెస్ట్​ పెట్టారు.

- Advertisement -

అక్షరటుడే, కమ్మర్​పల్లి: Kammarpally | కమ్మర్​పల్లి మండల ఇంగ్లిష్​ ఉపాధ్యాయుల అసోసియేషన్​ ఆధ్వర్యంలో మండంలంలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్ టాలెంట్ టెస్ట్ (English Talent Test) నిర్వహించారు. మండలంలోని ఎమ్మార్సీ భవన్​లో (MRC Bhavan) భారతీ ఎయిర్​టెల్​, టీఎస్ఎస్​సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఇంగ్లిష్​ భాషపై విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు.

దీంట్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చూపి బహుమతులు గెలుచుకున్నారు. పోటీలో జూనియర్​ విభాగంలో జడ్పీహెచ్​ఎస్​ బషీరాబాద్​ విద్యార్థి చిన్నబాబు మొదటిస్థానంలో నిలవగా.. చౌట్​పల్లి జడ్పీహెచ్​ఎస్​ విద్యార్థి రూపేష్​ ద్వితీయ స్థానంలో నిలిచాడు. సీనియర్స్ విభాగంలో బషీరాబాద్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థి అమూల్య మొదటి స్థానంలో నిలవగా మధుప్రియ రెండో స్థానంలో నిలిచారు.

వ్యాసరచన పోటీలో కోనసముందర్​ జడ్పీహెచ్​ఎస్​ విద్యార్థి శివాగౌడ్​ విద్యార్థి ప్రథమస్థానంలో, చౌట్​పల్లి జడ్పీహెచ్​ఎస్​ విద్యార్థి ప్రసన్న రెండోస్థానంలో నిలిచారు. సీనియర్స్​ విభాగంలో కమ్మర్​పల్లి జడ్పీహెచ్​ఎస్​ విద్యార్థి కార్తికేయ మొదటిస్థానంలో, కోనసముందర్​ జడ్పీహెచ్​ఎస్​ విద్యార్థి సందీప్​ రెండోస్థానంలో నిలిచారు. విజేతలకు ఎంఈవో ఆంధ్రయ్య బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఈఎల్​టీఏ ఉపాధ్యాయులు రవీంద్ర, మహికాంత్​, మధుబాబు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమానికి అబ్జర్వర్​గా మోర్తాడ్​ మండల ఇంగ్లిష్​ ఉపాధ్యాయుడు గున్నాల రవి వ్యవహరించారు.

Must Read
Related News