అక్షరటుడే, ఇందూరు: Kakatiya Engineering College | నగరంలోని కాకతీయ ఇంజినీరింగ్ కళాశాలలో (Kakatiya Engineering College) గురువారం రోడ్డు భద్రత ఉత్సవాలు (Road safety festivals) నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీవో ఉమా మహేశ్వర్ రావు మాట్లాడుతూ.. విద్యార్థులకు కచ్చితంగా రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలన్నారు. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపవద్దని సూచించారు. ఒకవేళ మైనర్లు బైక్, కార్లు డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడితే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదవుతాయని హెచ్చరించారు.
Kakatiya Engineering College | విద్యార్థులే మార్గదర్శకులు..
ఈ సందర్భంగా డీటీవో (RTA Nizamabad) మాట్లాడుతూ.. విద్యార్థులు అవగాహన కార్యక్రమాల్లో తెలుసుకున్న రోడ్డు భద్రత నియమాలను ఇంటికి వెళ్లాక వారి తల్లిదండ్రులకు సైతం వివరించాలన్నారు. సీట్‌బెల్ట్ లేకుండా కారు ఇతర వాహనాలు నడపవద్దని, హెల్మెట్ లేకుండా బైక్ నడపవద్దని సూచించాలన్నారు. అలాగే వాహనాల ఓవర్‌టేకింగ్ అత్యంత ప్రమాదకరమైందన్నారు. కార్యక్రమంలో ఎంవీఐ కిరణ్‌కుమార్, ఏఎంవీఐలు శృతి, వాసుకి, ఈ-దార్ మేనేజర్ వర్ష, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
