Hand Writing | చేతిరాత‌తో అబ్బుర‌ప‌రుస్తున్న ప్ర‌కృతి మ‌ల్లా.. ప్ర‌పంచంలోనే బెస్ట్ హ్యాండ్ రైటింగ్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hand Writing | డిజిటల్ యుగంలో చేతిరాత కళ క్రమంగా అరుదైపోతున్నప్పటికీ, నేపాల్‌ (Nepal)కు చెందిన 16 ఏళ్ల ప్రకృతి మల్లా తన అద్భుతమైన కాలిగ్రఫీతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలోనే అత్యంత అందమైన చేతిరాత కలిగిన అమ్మాయిగా గుర్తింపు పొందిన ప్రకృతి రాసిన 8వ తరగతి స్కూల్ అసైన్‌మెంట్ పేజీ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఆ పేజీలో కనిపించిన అక్షరాల స్పష్టత, సమతౌల్యం, శిల్పకళను తలపించే ఆకృతి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hand Writing | డిజిటల్ యుగంలో చేతిరాత కళ క్రమంగా అరుదైపోతున్నప్పటికీ, నేపాల్‌ (Nepal)కు చెందిన 16 ఏళ్ల ప్రకృతి మల్లా తన అద్భుతమైన కాలిగ్రఫీతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

ప్రపంచంలోనే అత్యంత అందమైన చేతిరాత కలిగిన అమ్మాయిగా గుర్తింపు పొందిన ప్రకృతి రాసిన 8వ తరగతి స్కూల్ అసైన్‌మెంట్ పేజీ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఆ పేజీలో కనిపించిన అక్షరాల స్పష్టత, సమతౌల్యం, శిల్పకళను తలపించే ఆకృతి నెటిజన్లను మంత్రముగ్ధులను చేసింది. డిజిటల్ స్క్రీన్లు, కీబోర్డులు ఆధిపత్యం సాగుతున్నతరం మధ్య, చేతిరాతను ఇంత కళాత్మకంగా తీర్చిదిద్దిన ప్రకృతి (Prakriti Malla) అంకితభావానికి విశేష ప్రశంసలు లభించాయి.

Hand Writing | అత్యుత్త‌మ రాత‌..

నేపాల్‌లోని బీరేంద్ర సైనిక్ ఆవాసియ మహావిద్యాలయం (Sainik Awasiya College)లో చదువుకున్న ఆమె దేశంలోనే అత్యుత్తమ చేతిరాత కలిగిన విద్యార్థినిగా స్కూల్ స్థాయిలోనే గుర్తింపు పొందింది. స్కూల్ అసైన్‌మెంట్‌గా రాసిన ఆ ఇంగ్లీష్ పేజీ వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రకృతి ప్రతిభ అక్కడే ఆగిపోలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ 51వ ‘స్పిరిట్ ఆఫ్ ది యూనియన్’ వేడుకల సందర్భంగా, ఆమె చేతిరాతతో రాసిన ప్రత్యేక అభినందన లేఖను ఖాట్మండులోని యూఏఈ ఎంబసీ (UAE Embassy)కి స్వయంగా అందజేసింది. లేఖలోని అద్భుతమైన కాలిగ్రఫీ చూసి ముచ్చటపడిన ఎంబసీ అధికారులు, ఆమెను “ప్రపంచంలోనే అత్యంత అందమైన చేతిరాత కలిగిన అమ్మాయి”గా ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

దీంతో ప్రకృతి ప్రతిభ మరోసారి అంతర్జాతీయ స్థాయి (International Level)లో చర్చనీయాంశమైంది. ఆమెకు నేపాలీ సాయుధ పోలీసు దళం, నేపాల్ ప్రభుత్వం (Nepal Government) తదితరులు ప్రత్యేకంగా అభినంద‌న‌లు తెల‌ప‌డం విశేషం. ఆమె రచన నేపాల్‌లోనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే అత్యుత్త‌మంగా పేరుగాంచింది.నేపాల్ ప్రభుత్వం ఆమె కు ఉత్తమ నగీషీరాత అని కూడా ప్రశంసించింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...