అక్షరటుడే, వెబ్‌డెస్క్: Makloor | విద్యుత్ షాక్ కొట్టి చిన్నారి మృతి చెందిన విషాద ఘటన మక్లూరు మండలం చిక్లి makloor Mandal chikli village గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గడ్డం నవీన్-రచన కుమార్తె వేదాన్షి(6) ఆదివారం ఇంటి బయట ఆడుకుంది. ఈ సమయంలో అక్కడే ఉన్న ఇనుప కూలర్ ను ముట్టుకుంది. దీంతో విద్యుత్ షాక్ current shock తగిలి పడిపోయింది. కుటుంబసభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
