అక్షరటుడే, ఇందూరు: Republic Day | గణతంత్ర దినోత్సవ వేడుకలను (Republic Day celebrations) పురస్కరించుకొని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar) అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Republic Day | అధికారులకు దిశానిర్దేశం..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా సమగ్ర వివరాలతో ప్రగతి నివేదిక రూపొదించాలన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందికి ప్రాధాన్యతనిస్తూ 21వ తేదీలోపు పేర్లను సిఫార్సు చేయాలని అధికారులకు సూచించారు. గణతంత్ర దినోత్సవం రోజు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్కో అధికారులను (Transco officials) ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.