167
అక్షరటుడే, కమ్మర్పల్లి: Chinese Manja | ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజాపై నిషేధం ఉందని.. ఎవరైనా ఈ మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాని ఎస్సై జి. అనిల్‌రెడ్డి (Sub-Inspector G. Anil Reddy) హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం కమ్మర్పల్లి మండల కేంద్రంలో పలు దుకాణాలను సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు.
Chinese Manja | సాధారణ దారాలనే వినియోగించాలి
గాలిపటాలు ఎగురవేసేందుకు సాధారణ మాంజాలనే వినియోగించాలని ఎస్సై సూచించారు. చైనా మాంజాల (Chinese Manja) కారణంగా మనుషులతో పాటు పక్షులకు కూడా అపాయం పొంచి ఉందని ఆయన తెలియజేశారు. దీంతో ప్రభుత్వం గతంలోనే చైనామాంజాపై నిషేధం విధించిందని పేర్కొన్నారు. ఈ మేరకు చైనా మాంజా ఎవరి విక్రయించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.