అక్షరటుడే, వెబ్‌డెస్క్: CP Sajjanar | హైదరాబాద్ నగరంలో (Hyderabad City) వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అయినా కూడా కొందరు వాహనదారులు నిబంధనలు పాటించడం లేదు.
నగరంలో చాలా మంది వాహనదారులు ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా కారు, ఆటోలు నడిపేవారు ఫోన్లలో వీడియోలు చూస్తున్నారు. పలువురు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో అలాంటి వారికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) వార్నింగ్ ఇచ్చారు. డ్రైవింగ్ సమయంలో ఫోన్‌లో వీడియోలు చూడటం, ఇయర్‌ఫోన్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్ఛరించారు.
CP Sajjanar | నిబంధనలు పాటించాలి
ఆటో, క్యాబ్, బైక్ ట్యాక్సీ డ్రైవర్లు (taxi drivers) ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. స్వీయ, ప్రయాణీకులు తోటి రోడ్డు వినియోగదారుల భద్రత చాలా ముఖ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలు పోతాయన్నారు. డ్రైవింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.