Homeజిల్లాలునిజామాబాద్​Dichpally | చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు

Dichpally | చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు

ఆటోడ్రైవర్లు ట్రాఫిక్​ నిబంధనలు పాటించాలని డిచ్​పల్లి ఎస్సై మహమ్మద్ ఎండీ షరీఫ్ పేర్కొన్నారు. స్థానిక రైల్వేస్టేషన్​ వద్ద ఆటోడ్రైవర్లకు పలు సూచనలు సలహాలు అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally | చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డిచ్​పల్లి ఎస్సై మహమ్మద్ ఎండీ షరీఫ్ (Dichpally SI Sharif) హెచ్చరించారు. బుధవారం డిచ్​పల్లి రైల్వేస్టేషన్ ఎదుట ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. రైల్వేస్టేషన్ ఎదుట రోడ్డు పక్కన పిచ్చి మొక్కలను జేసీబీ సహాయంతో తొలగింపజేశారు.

ఆర్టీసీ బస్సులు నిలిపేందుకు రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఆర్టీసీ అధికారులతో మాట్లాడి నూతనంగా ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ బోర్డులను ఏర్పాటు చేయించారు. నిజామాబాద్ – డిచ్​పల్లి ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా ఆటోడ్రైవర్లకు పలు సూచనలు చేశారు.

రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా వేసుకున్న షెడ్లను తొలగించాలని, లేకుంటే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ వినోద్, రాజేందర్, దశరథ్, తదితరులు పాల్గొన్నారు.