అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Operation Smile | చిన్నారులతో బలవంతంగా భిక్షాటన, వెట్టి చాకిరీ చేయిస్తున్న వాళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి (Additional DCP Baswareddy) అన్నారు. ఈ మేరకు సోమవారం సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచనల మేరకు ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Operation Smile | కమిషనరేట్ పరిధిలో..
ఈ సందర్భంగా అదనపు డీసీపీ మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ డివిజన్ల పరిధిలో 18 ఏళ్ల లోపు తప్పిపోయిన బాలురు, బాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం సేకరించి వారి తల్లి దండ్రులకు అప్పగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా జనవరి 1 నుంచి 31 వరకు ప్రత్యేకంగా ‘ఆపరేషన్ స్మైల్’ (Operation Smile) కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేకంగా డివిజన్ పరిధిలో ఒక ఎస్సై స్థాయి అధికారిని నియమించి.. నలుగురు సిబ్బంది, ఒక మహిళా కానిస్టేబుల్ను అటాచ్ చేస్తామని వివరించారు.
Operation Smile | తప్పిపోయిన బాలబాలికలు కనిపిస్తే..
ప్రజలు తమకు తప్పిపోయిన బాలబాలికలు కనిపిస్తే.. డయల్ 100, నిజామాబాద్ ఇన్ఛార్జి ఎస్సై రాజేశ్వర్ 87125 77816, ఆర్మూర్ ఇన్ఛార్జి ఎస్సై ఇంద్రకరణ్ రెడ్డి 94401 40022, బోధన్ ఇన్ఛార్జి ఎస్సై పీటర్ 94405 66595లకు ఫోన్ చేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.
కార్యక్రమంలో సీసీఆర్బీ సీఐ అంజయ్య, చైల్డ్, ఉమెన్ డిస్టిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బీ, చైల్డ్ ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ సుదాం లక్ష్మి, డిస్టిక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ సంపూర్ణ, లేబర్ ఆఫీసర్ ప్రభుదాస్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారి రాజు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్య, ఏహెచ్టీయూ (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్) సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.