అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stomach Cleansing : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో, తిన్నది సరిగ్గా అరగడం, పొట్ట ఎప్పటికప్పుడు శుభ్రపడటం కూడా అంతే ముఖ్యం. మన శరీరంలోని జీవక్రియలు (Metabolism) సజావుగా సాగాలంటే జీర్ణవ్యవస్థ పనితీరు బాగుండాలి.
పొట్ట మలినాలతో నిండి ఉంటే కడుపు ఉబ్బరం, అజీర్తి, ఎసిడిటీ, మలబద్ధకం వంటి ఇబ్బందులు మనల్ని వేధిస్తాయి. మన వంటగదిలో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఎలాంటి ఖర్చు లేకుండా పొట్టను, పేగులను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఉసిరి రసం Amla Juice: Stomach Cleansing | రాత్రి నిద్రపోయే ముందు కొద్దిగా ఉసిరి రసాన్ని తాగడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఉసిరిలోని విటమిన్-సీ, యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణాశయ వ్యవస్థను శుద్ధి చేస్తాయి. దీనివల్ల ఉదయం నిద్రలేవగానే పొట్టలోని వ్యర్థాలన్నీ సులభంగా బయటకు విసర్జితమవుతాయి.
అల్లం రసం / అల్లం టీ Ginger Juice / Ginger Tea: Stomach Cleansing | ఉదయాన్నే పరగడుపున అల్లం టీ తాగడం లేదా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల అల్లం రసం కలుపుకొని తాగడం చాలా మంచిది. అల్లం జీర్ణకోశ సమస్యలను దూరం చేయడమే కాకుండా, పేగులలో పేరుకున్న మలినాలను బయటకు పంపి కడుపును తేలికగా ఉంచుతుంది.
వాము నీళ్లు Carom Seeds Water: Stomach Cleansing | రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో చెంచా వాము వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగాలి. వాములోని పీచు పదార్థాలు పేగులలో గూడుకట్టుకున్న వ్యర్థాలను తొలగిస్తాయి. ఇది మలబద్ధకం సమస్యకు అద్భుతమైన పరిష్కారం.
తేనె, నిమ్మరసం: Stomach Cleansing | ఇది అత్యంత ప్రజాదరణ పొందిన చిట్కా. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చెంచా తేనె, నిమ్మరసం కలుపుకొని తాగితే జీర్ణవ్యవస్థ ఉత్తేజితమై మలినాలు బయటకు వెళ్ళిపోతాయి.
మజ్జిగ ప్రాముఖ్యం: మజ్జిగ ఒక సహజమైన ప్రోబయోటిక్. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా జీర్ణాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. తరచూ పలుచని మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్లు తొలగిపోయి పొట్ట ప్రశాంతంగా ఉంటుంది.
జీలకర్ర నీరు Cumin Water: కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో బాధపడేవారికి జీలకర్ర నీరు వరప్రసాదం. ఇందులోని పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. దీనివల్ల ఎప్పటికప్పుడు పొట్ట శుభ్రపడుతుంది.
త్రిఫల చూర్ణం: ఆయుర్వేదం ప్రకారం త్రిఫల చూర్ణం పొట్ట శుద్ధికి దివ్యౌషధం. అరచెంచా చూర్ణాన్ని గోరువెచ్చని పాలు లేదా నీళ్లలో కలుపుకుని తాగితే శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి.
పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం: వీటితో పాటు రోజువారీ ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, ఓట్స్, శనగలు వంటి పీచు (Fiber) అధికంగా ఉండే పదార్థాలను చేర్చుకోవడం వల్ల పొట్ట సహజంగానే శుభ్రంగా ఉంటుంది.