అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic stock market) నష్టాల్లో కొనసాగుతోంది. సోమవారం ఉదయం సెన్సెక్స్ 164 పాయింట్ల నష్టంతో ప్రారంభమెన అక్కడినుంచి మరో 2066 పాయింట్లు పడిపోయింది.
కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రాడేలో గరిష్టంగా 464 పాయింట్లు పెరిగింది. 55 పాయింట్ల నష్టంతో ప్రారంభమై నిఫ్టీ(Nifty).. మరో 50 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద కోలుకుని 157 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 137 పాయింట్ల నష్టంతో 81,325 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 24,811 వద్ద కొనసాగుతున్నాయి. ఈ వారంలో అమెరికా ఫెడ్ రిజర్వ్ మీటింగ్ ఉండడం, యూఎస్‌తో ట్రేడ్ డీల్ విషయంలో అనిశ్చితితో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
Stock Market | బ్యాంకింగ్, మెటల్ స్టాక్స్‌లో సెల్లాఫ్
దేశీయ స్టాక్ మార్కెట్‌లోని సూచీలు మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్(Banking), మెటల్, రియాలిటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది. బీఎస్‌ఈలో రియాలిటీ(Realty) ఇండెక్స్ 2.17 శాతం పడిపోగా.. మెటల్ సూచీ 0.78 శాతం, బ్యాంకెక్స్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 0.73 శాతం, ఐటీ 0.63 శాతం, టెలికాం ఇండెక్స్ 0.58 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. ఎఫ్‌ఎంసీజీ 0.52 శాతం, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు 0.44 శాతం, ఎనర్జీ 0.43 శాతం, ఇన్‌ఫ్రా 0.25 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.23 శాంతం లాభంతో ఉన్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్(Mid cap index) 0.12 శాతం లాభంతో ఉండగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.32 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం నష్టంతో ఉన్నాయి.
Stock Market | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 15 కంపెనీలు నష్టాలతో ఉండగా.. 15 కంపెనీలు లాభాలతో ఉన్నాయి. హెచ్‌యూఎల్ 0.99 శాతం, ఆసియా పెయింట్ 0.97 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.92 శాతం, పవర్‌గ్రిడ్ 0.79 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.78 శాతం లాభాలతో సాగుతున్నాయి.
Stock Market | Top losers..
కొటక్ బ్యాంక్ 6.47 శాతం, బీఈఎల్ 1.82 శాతం, ఎయిర్‌టెల్ 1.78 శాతం, టైటాన్ 1.36 శాతం, టీసీఎస్ 1.05 శాతం నష్టాలతో ఉన్నాయి.