Homeబిజినెస్​Stock Market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ

Stock Market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ

- Advertisement -

Stock Market | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) ఎక్కువగా నష్టాలతో ఉన్నా.. మన మార్కెట్లు మాత్రం స్వల్ప లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 27 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమై వెంటనే 177 పాయింట్లు కోల్పోయింది.

అక్కడినుంచి కోలుకుని 323 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 15 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై మరో 36 పాయింట్లు తగ్గింది. కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో కోలుకుని 101 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 138 పాయింట్ల లాభంతో 80,782 వద్ద, నిఫ్టీ(Nifty) 38 పాయింట్ల లాభంతో 25,018 వద్ద కొనసాగుతున్నాయి.

ఐటీలో దూకుడు : ఇటీవల భారీగా కరెక్షన్‌కు గురైన ఐటీ స్టాక్స్‌(IT stocks)లో కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ 1.66 శాతం పెరగ్గా.. టెలికాం 1.22 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.99 శాతం, మెటల్‌ 0.72 శాతం, పవర్‌ 0.58 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.52 శాతం, కమోడిటీ ఇండెక్స్‌ 0.48 శాతం లాభాలతో ఉన్నాయి. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 0.41 శాతం నష్టంతో ఉండగా.. బ్యాంకెక్స్‌(Bankex) 0.38 శాతం, ఆటో ఇండెక్స్‌ 0.12 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.36 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.33 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.18 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 15 కంపెనీలు లాభాలతో ఉండగా.. 15 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఇన్ఫోసిస్‌ 2.87 శాతం, ఎటర్నల్‌ 2.52 శాతం, హెచ్‌యూఎల్‌ 1.89 శాతం, టీసీఎస్‌ 1.75 శాతం, టాటా స్టీల్‌ 1.73 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : బజాజ్‌ ఫైనాన్స్‌ 1.43 శాతం, బీఈఎల్‌ 1.32 శాతం, టాటా మోటార్స్‌ 1.20 శాతం, ట్రెంట్‌ 0.73 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 0.72 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి.

Must Read
Related News