అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) వరుసగా ఐదో రోజూ నష్టాల్లోనే కొనసాగుతోంది. ఆటో రంగానికి చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. ఐటీ(IT) షేర్లలో పతనం ఆగడం లేదు.
గురువారం ఉదయం సెన్సెక్స్(Sensex) 141 పాయింట్లు, నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. స్వల్ప ఒడిదుడుకుల మధ్య సెన్సెక్స్ 81,472 నుంచి 81,840 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 24,984 నుంచి 25,092 పాయింట్ల మధ్యలో సాగుతున్నాయి. మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 246 పాయింట్ల నష్టంతో 81,468 వద్ద, నిఫ్టీ(Nifty) 81 పాయింట్ల నష్టంతో 24,975 వద్ద ఉన్నాయి.
Stock Market | మిక్స్‌డ్‌గా సూచీలు..
బీఎస్‌ఈ(BSE)లో క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.67 శాతం, టెలికాం 0.49 శాతం, మెటల్ ఇండెక్స్ 0.46 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ 0.27 శాతం పెరిగాయి. రియాలిటీ ఇండెక్స్ 1.13 శాతం, ఆటో(Auto) 0.70 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 0.64 శాతం, ఐటీ 0.48 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.26 శాతం నష్టాలతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.26 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.22 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.06 శాతం నష్టాలతో సాగుతున్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 8 కంపెనీలు లాభాలతో ఉండగా.. 22 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. బీఈఎల్ 2.40 శాతం, సన్‌ఫార్మా 0.95 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.88 శాతం, ఎయిర్‌టెల్ 0.59 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.16 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : టాటా మోటార్స్ 2.96 శాతం, అసియా పెయింట్ 2.04 శాతం, ట్రెంట్ 2.02 శాతం, టీసీఎస్ 1.32 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.14 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.