అక్షరటుడే, ఢిల్లీ: PM Modi | జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అన్నారు. రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు (GST reforms) అమలు కానున్నాయని తెలిపారు.
ఆయన ఆదివారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్యతరగతి (middle class) ఎంతో ఆదాయం మిగలనుందని చెప్పారు. పండుగల సమయంలో దేశంలోని అందరికీ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో భారత వృద్ధి రేటు మరింత పెరుగుతుందన్నారు.
PM Modi | కొత్త అధ్యాయం మొదలైంది..
2017లో జీఎస్టీతో కొత్త అధ్యాయం మొదలైందని ప్రధాని అన్నారు. అంతకు ముందు ఎన్నో రకాల పన్నులు ఉండేవన్నారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలన్నా పన్నులు కట్టాల్సి ఉండేదని గుర్తు చేశారు. గతంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ (Bengalore – Hyderabad) వచ్చి వస్తువులు అమ్ముకోవాలంటే ఎంతో కష్టంగా ఉండేదన్నారు.
గతంలో టాక్స్, టోల్‌తో కంపెనీలన్నీ ఇబ్బందులు పడ్డాయని చెప్పారు. ఆ భారమంతా వినియోగదారులపై పడేదని.. కానీ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం అందరికీ మేలు జరుగుతోందన్నారు. జీఎస్టీ సంస్కరణలు ఎఫ్‌డీఐలను సైతం మరింత ప్రోత్సహిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
PM Modi | వన్ నేషన్ – వన్ టాక్స్
2024లో గెలిచిన తరువాత జీఎస్టీకి (GST) ప్రాధాన్యం ఇచ్చామని మోదీ అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై అన్ని వర్గాలతో మాట్లాడామని చెప్పారు. ‘వన్ నేషన్- వన్ టాక్స్’ (One Nation – One Tax) కలను సాకారం చేశామని వివరించారు. అన్ని రంగాల్లో సంస్కరణలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. కొత్త జీఎస్టీతో నిత్యావసర వస్తువులన్నీ మరింత చౌకగా మారతాయన్నారు. జీఎస్టీ సంస్కరణలు దేశాన్ని మరింత బలంగా మారుస్తాయన్నారు. కొన్నింటిపై పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చామని చెప్పారు.
PM Modi | మధ్య తరగతి జీవితాల్లో మార్పు
రూ.12 లక్షల వరకు ఆదాయపన్నును తొలగించామని ప్రధాని తెలిపారు. ఈ చర్యలతో మధ్య తరగతి జీవితాల్లో ఎంతో మార్పు రానుందని సంతోషం వ్యక్తం చేశారు. కొత్త జీఎస్టీతో పేద మధ్యతరగతివారికి డబుల్ బొనాంజా అని చెప్పారు. టీవీ, ఫ్రిజ్, స్కూటర్, ఇంటి నిర్మాణం ఇలా చాలా వాటిపై ఖర్చు తగ్గుతుందన్నారు. జీఎస్టీ సంస్కరణలు అన్ని రంగాల్లో మార్పు తీసుకొస్తాయని ఆయన అన్నారు.
PM Modi | 99 శాతం వస్తువులు 5 శాతం శ్లాబులోకి..
నాగరికత దేవోభవ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని నరేంద్ర మోదీ తెలిపారు. 99 శాతం వస్తువులు 5 శాతం శ్లాబుల్లోకి మార్చామని వివరించారు. చిన్న పరిశ్రమలే (small industries) భారత్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దిక్సూచిగా మారాయని పేర్కొన్నారు. అందరూ స్వదేశీ వస్తువులనే ప్రోత్సాహించాలని విజ్ఞప్తి చేశారు. మన దేశంలో తయారయ్యే వస్తువులనే కొనాలని కోరారు. స్వదేశీ వస్తువులను కొన్నామని ఇతరులకు గర్వంగా చెప్పాలని మోదీ అన్నారు.