అక్షరటుడే, ఇందూరు : Telangana Thalli | జిల్లా కలెక్టరేట్లో (Nizamabad Collectorate) మంగళవారం తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో నూతనంగా నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రోడ్లు–భవనాల శాఖ ఎస్ఈ కె.సర్దార్ సింగ్ ఆవిష్కరించారు.
Telangana Thalli | రాష్ట్ర సచివాలయం తరహాలోనే..
రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన నమూనాను అనుసరిస్తూ జిల్లాలలో కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా విగ్రహాన్ని రూపొందించారు. ఆకట్టుకునే రీతిలో, స్ఫూర్తిదాయకంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం అందరినీ ఆకర్షించింది. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ (Collectorate Ao Prashant), వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.