అక్షరటుడే, భిక్కనూరు : Jubilee Hills by Election | కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy) అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by Election) సందర్భంగా ఆయన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో భాగంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. ఓటర్లు వారి ప్రలోభాలకు లొంగకుండా అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోందని చెప్పారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
