అక్షరటుడే, ఇందూరు : TUCI Nizamabad | కార్మికులకు వ్యతిరేకంగా అమలు చేసిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేందర్, సుధాకర్ డిమాండ్ చేశారు. నగరంలోని కోట గల్లీలో ఉన్న ఎన్ఆర్ భవన్లో (NR Bhavan) విలేకరుల సమావేశం నిర్వహించారు.
TUCI Nizamabad | 18న హైదరాబాద్లో..
ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు నరేందర్, సుధాకర్ మాట్లాడుతూ… లేబర్ కోడ్లను (Labor Code) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18 హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. జిల్లాలోని కార్మికులంతా చలో హైదరాబాద్ (Hyderabad) సదస్సును విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, సహాయ కార్యదర్శి మల్లేష్, కిషన్, కోశాధికారి సాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.