ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​SRSP | శ్రీరాం​సాగర్​కు తగ్గిన ఇన్​ఫ్లో

    SRSP | శ్రీరాం​సాగర్​కు తగ్గిన ఇన్​ఫ్లో

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: SRSP | శ్రీరాంసాగర్​లోకి (Sriram Sagar project) ఇన్​ఫ్లో స్వల్పంగా వచ్చి చేరుతోంది. మహారాష్ట్రతో పాటు, నిజామాబాద్​, నిర్మల్​ జిల్లాల్లో వర్షాలు కురవకపోవడంతో ఇన్​ఫ్లో వరద నీరు తగ్గుముఖం పట్టింది.

    SRSP | 2,172 క్యూసెక్కుల మేరకు..

    ప్రస్తుతం ప్రాజెక్ట్​లోకి 2,172 మేర ఇన్​ఫ్లో వస్తోంది. ఆదివారం 3,653 క్యూసెక్కులు వచ్చింది. రోజురోజుకూ ఇన్​ఫ్లో తగ్గుతూ వస్తోంది. ప్రాజెక్ట్​లో 359 క్యూసెక్కులు ఆవిరి రూపంలో వెళ్లిపోతుంది. మిషన్​ భగీరథకు (Mission Bhagiratha) 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు ఎగువన వర్షాలు పడకపోవడంతో ఇన్​ఫ్లో తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 20.902 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 12.788 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

    SRSP | అక్టోబర్​ వరకు బాబ్లీ గేట్లు ఓపెన్​..

    సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు జూలై 1న బాబ్లీ గేట్లు (Babli Gates) తెరిచారు. అక్టోబర్​ 29వ తేదీ వరకు గేట్లు తెరిచి ఉంచుతారు. ఎగువన కురిసే వర్షాలకు వచ్చే నీరు అక్టోబర్​ 29 వరకు నేరుగా ఎస్సారెస్పీకి చేరుతుంది. గతేడాది బాబ్లీ ద్వారా 293 టీఎంసీల నీరు శ్రీరాంసాగర్​లోకి రాగా యాసంగి పంటలకు ప్రాజెక్ట్​ పరిధిలోని 6,24,000 ఎకరాలకు 73 టీఎంసీల నీటిని అందించారు. మిడ్ మానేరు, మల్లన్న సాగర్ తో పాటు వివిధ ప్రాజెక్టులకు కాల్వల ద్వారా సాగు, తాగు నీటిని అందించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...