Sriram sagar | శ్రీరాంసాగర్​కు​ కొనసాగుతున్న వరద.. నాలుగు గేట్లు ఎత్తివేత

అక్షరటుడే, మెండోరా: Sriram sagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికి ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండి గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు (Sriram sagar Project) పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1091.90 అడుగుల (80.051 టీఎంసీలు)కు చేరింది. Sriram sagar | కాల్వల ద్వారా కొనుసాగుతున్న విడుదల వరద నీరు […]

అక్షరటుడే, మెండోరా: Sriram sagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికి ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది.

దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండి గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు (Sriram sagar Project) పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1091.90 అడుగుల (80.051 టీఎంసీలు)కు చేరింది.

Sriram sagar | కాల్వల ద్వారా కొనుసాగుతున్న విడుదల

వరద నీరు భారీగా చేరుతున్న (heavy inflow) నేపథ్యంలో ప్రాజెక్టు నుండి వివిధ కాల్వల ద్వారా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా 5,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3,000 క్యూసెక్కులు వదులుతున్నారు. సరస్వతి కాలువ (Saraswati canal) ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు పోను అదనంగా 573 క్యూసెక్కుల నీరు ఆవిరైపోతోంది. అలాగే, ఎఫ్​ఎఫ్​సీ అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల ప్రాజెక్టులకు నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...