Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు కొనసాగుతున్న వరద

అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​ (SRSP)లోకి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 37 వరద గేట్లు ఓపెన్​ చేసి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి ప్రస్తుతం 1.40 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 1090.90 (80.05 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. రాష్ట్రంలో, మహారాష్ట్రలో వర్షాలు పడుతుండటంతో ప్రాజెక్ట్​కు వరద పెరిగే […]

అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​ (SRSP)లోకి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 37 వరద గేట్లు ఓపెన్​ చేసి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.

జలాశయంలోకి ప్రస్తుతం 1.40 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 1090.90 (80.05 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. రాష్ట్రంలో, మహారాష్ట్రలో వర్షాలు పడుతుండటంతో ప్రాజెక్ట్​కు వరద పెరిగే అవకాశం ఉంది. దీంతో అధికారులు గోదావరిలోకి నీటి విడుదలను పెంచారు. శనివారం తొమ్మిది గేట్ల ద్వారా దిగువకు నీటిని వదిలిన అధికారులు ఆదివారం 37 గేట్లను ఎత్తారు.

Sriram Sagar | నీటి విడుదల వివరాలు

ఎస్సారెస్పీ నుంచి 37 గేట్ల ద్వారా 1.50 లక్షల క్యూసెక్కులు, ఎస్కేప్​ గేట్ల ద్వారా 4 వేలు, కాకతీయ కాలువకు 4 వేలు, సరస్వతి కాలువకు 650, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల పోతోంది. దీంతో మొత్తం ఔట్​ ఫ్లో 1,59,790 క్యూసెక్కులుగా ఉంది. ఎగువ నుంచి వరద పెరిగే అవకాశం ఉండటంతో గేట్ల ద్వారా నీటి విడుదల పెంచుతామని, గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Sriram Sagar | నిజాంసాగర్​లోకి..

అక్షరటుడే, ఎల్లారెడ్డి : నిజాంసాగర్​ (Nizam Sagar) ప్రాజెక్ట్​లోకి ఇన్​ఫ్లో కొనసాగుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 21,377 క్యూసెక్కుల వరద వస్తోంది. వరద గేట్ల ద్వారా 19,083 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 17.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...