అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరద ప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌కు (Sriram Sagar project) ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు 39 గేట్లు ఎత్తి గోదావరిలోకి (Godavari) నీటిని వదులుతున్నారు.
జలాశయంలోకి ప్రస్తుతం 2,61,263 క్యూసెక్కుల వరద వస్తోంది. గత నాలుగైదు రోజులుగా వరద పోటెత్తడంతో అధికారులు ప్రాజెక్ట్‌లో నీటి నిల్వను తగ్గించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం (water level) 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం.. 1086 అడుగుల (63.93 టీఎంసీలు) నీరు ఉంది.
Sriram Sagar | నీటి విడుదల వివరాలు
ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వారా 2.50 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. వరద కాలువకు 2 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 5,500, సరస్వతి కాలువకు 400, మిషన్ భగీరథకు (Mission Bhagiratha) 231 క్యూసెక్కులు వదులుతున్నారు. 632 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది. మొత్తం 2,61,263 క్యూసెక్కుల ఔట్ ఫ్లో (Out Flow) నమోదు అవుతోంది. ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో సమానంగా ఉండటంతో ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉంది. లక్ష్మి కాలువ, అలీ సాగర్, గుత్ప ఎత్తిపోతలలకు అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు.
Sriram Sagar | పర్యాటకుల సందడి
దసరా సెలవులు (Dussehra holidays) కావడంతో ఎస్సారెస్పీకి పర్యాటకులు తరలి వస్తున్నారు. నాలుగైదు రోజులుగా ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలను భారీగా పెంచారు. దీంతో గోదావరి జలసవ్వడులు తిలకించడానికి ప్రజలు తరలి వస్తున్నారు. అయితే అధికారులు గేట్లు ఉన్న ప్రాంతం వైపు ఎవరిని అనుమతించడం లేదు.
Sriram Sagar | అప్రమత్తంగా ఉండాలి
గోదావరి, కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 39 గేట్ల ద్వారా గోదావరి నదిలోకి భారీగా నీటిని వదులుతుండటంతో దిగువన గల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నదీ సమీపంలోకి వెళ్లొద్దన్నారు. ముఖ్యంగా చేపల వేటకు, పశువులు కాయడానికి నదిలోకి వెళ్లే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు.