Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు పోటెత్తిన వరద.. 39 గేట్ల ద్వారా 5 లక్షల క్యూసెక్కుల విడుదల

అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు వరద పోటెత్తింది. ఉమ్మడి మెదక్​, నిజామాబాద్​ జిల్లాల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్ట్​లోకి భారీగా ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది. ఎస్సారెస్పీ (SRSP)లోకి ప్రస్తుతం 4.30 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో అధికారులు 39 వరద గేట్లను ఎత్తి 5.04 లక్షల క్యూసెక్కులను గోదావరి (Godavari)లోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 1086.60 (65.135 టీఎంసీలు) అడుగుల […]

అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు వరద పోటెత్తింది. ఉమ్మడి మెదక్​, నిజామాబాద్​ జిల్లాల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్ట్​లోకి భారీగా ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది.

ఎస్సారెస్పీ (SRSP)లోకి ప్రస్తుతం 4.30 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో అధికారులు 39 వరద గేట్లను ఎత్తి 5.04 లక్షల క్యూసెక్కులను గోదావరి (Godavari)లోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 1086.60 (65.135 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది.

Sriram Sagar | ముందు జాగ్రత్తగా..

నిజామాబాద్​, కామారెడ్డి, మెదక్​ జిల్లాల్లో అతి భారీ వర్షాలతో జలప్రళయం వచ్చింది. వాగులు, వంకలు ఉధృతంగా పారుతున్నాయి. నదులకు భారీగా వరద పోటెత్తింది. దీంతో శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ముందు జాగ్రత్తగా డ్యామ్​లో నీటిని ఖాళీ చేశారు. మొన్నటి వరకు 80 టీఎంసీల నీటిని నిల్వ చేసిన అధికారులు.. దిగువకు నీటి విడుదలను పెంచి ప్రస్తుతం 65 టీఎంసీల నీటి మట్టాన్ని కొనసాగిస్తున్నారు. ఎగువ నుంచి భారీ వరద వచ్చినా ప్రాజెక్ట్​కు ఇబ్బంది లేకుండా దిగువకు నీటి విడుదలను పెంచారు.

Sriram Sagar | కాల్వలకు నీటి విడుదల నిలిపివేత

శ్రీరామ్​సాగర్ ప్రాజెక్ట్​​ నుంచి వరద గేట్ల ద్వారా 5.04 లక్షల క్యూసెక్కులు గోదావరిలోకి వదులుతున్నారు. ఎస్కేప్​ గేట్ల ద్వారా 8 వేలు, వరద కాలువ (Varada Kaluva)కు 17,300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో ఆయకట్టుకు నీటి విడుదలను నిలిపివేశారు. కాకతీయ, సరస్వతి, లక్ష్మి కాలువలకు నీటిని వదలడం లేదు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 636 క్యూసెక్కుల నీరు పోతోంది. దీంతో మొత్తం 5,30,622 క్యూసెక్కుల ఔట్​ ఫ్లో నమోదు అవుతోంది.

Sriram Sagar | అప్రమత్తంగా ఉండాలి

ప్రాజెక్ట్​ నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్​ ఏఈఈ కొత్త రవి సూచించారు. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో నీటి విడుదల పెంచే అవకాశం ఉంది. దీంతో ప్రజలు నది సమీపంలోకి వెళ్లొద్దని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా పశువుల కాపార్లు, మత్స్యకారులు నదిలోకి వెళ్లవద్దన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...