అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Actress Sri Leela | అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి, తన ప్రతిభతో ప్రేక్షకులను, సినీ పరిశ్రమను ఎంతగానో ఆకట్టుకుంటున్న అందాల ముద్దుగుమ్మ శ్రీలీల. ఇప్పుడు టాలీవుడ్‌నే కాదు, బాలీవుడ్‌ను (Bollywood) కూడా తన గ్లామర్, నటనతో ఆకర్షిస్తోంది.
టాప్ హీరోల సరసన వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ఆమె క్రేజ్ అమాంతం పెంచేసుకుంటుంది. ఇప్పుడైతే ఆమె బాలీవుడ్‌లో కూడా గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. బాలీవుడ్‌లో శ్రీలీల ‘తు మేరీ జిందగీ హై’ అనే చిత్రంలో స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్ (Hero Kartik Aaryan) సరసన నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఈ రోమాంటిక్ మ్యూజికల్ డ్రామా ఇప్పటికే భారీ అంచనాల మధ్య ముంబయిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఆషికి తరహాలో ఓ ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందుతోంది.
Actress Sri Leela | పక్కా ప్లానింగ్‌తో..
మే 2026లో ఈ చిత్రం రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. 2025 చివరికి టాకీ పార్ట్ పూర్తి చేసి 2026 ప్రారంభంలో పాటల చిత్రీకరణ జరపనున్నారని టాక్. శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ మూవీ ఆమె కెరీర్‌కి ఎంతగా హెల్ప్ అవుతుందా అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే బాలీవుడ్ బిజీ షెడ్యూల్‌తో పాటు శ్రీలీల (Actress Sri Leela) టాలీవుడ్‌లోనూ సూపర్ క్రేజీ ప్రాజెక్ట్స్‌కు కమిట్ అయింది. పరాశక్తి, ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ జాతర వంటి సినిమాలు చేస్తుంది. మాస్ జాతర ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని అక్టోబర్ 31న విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్, మాస్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ కావడం విశేషం.
సినిమాలతో పాటు కార్పొరేట్ బ్రాండ్ల ప్రచారాల్లోనూ శ్రీలీలకు మంచి డిమాండ్ ఉంది. తాజాగా ప్రముఖ జర్మన్ ఏవియేషన్ గ్రూప్ – లుఫ్తాన్సా ప్రచార కార్యక్రమంలో శ్రీలీల పాల్గొంది. లండన్ కేంద్రంగా ఈ బ్రాండ్ కోసం ఆమె చేసిన ఫోటోషూట్ యూత్‌లో భారీగా వైరల్ అవుతోంది. యూత్‌ను ఆకట్టుకునే స్టైలిష్ పిక్స్‌తో శ్రీలీల ఈ బ్రాండ్‌కు బంపర్ మైలేజ్ తీసుకొచ్చిందన్నదే ట్రేడ్ టాక్. ఒక్కసారి ఛాన్స్ వస్తే తన టాలెంట్‌తో ఆ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో శ్రీలీల చూపించింది. కేవలం టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌తో పాటు కమర్షియల్ బ్రాండ్లలోనూ తన పాపులారిటీని మెరుగుపరుచుకుంటూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతోంది. ఇండస్ట్రీలో పోటీ ఎంత ఉన్నా, శ్రీలీల స్థానం మాత్రం స్లో అండ్ స్టడీగా దూసుకుపోతోంది. ఆమె కెరీర్ జోరు చూస్తే రానున్న రోజులలో ఆమె స్టార్ డమ్ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది.