అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: MLA Bhupathi Reddy | క్రీడలు జీవితంలో ఓ భాగం కావాలని.. క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం కలుగుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) అన్నారు. గంజాయి వంటి మత్తుపదార్థాలకు యువత బానిస కాకుండా క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. నగరానికి చెందిన ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీ (cricket tournament) ముగింపు వేడుకలను ఆయన హాజరయ్యారు.
MLA Bhupathi Reddy | గెలుపోటములు సహజం
క్రీడల్లో గెలుపోటములు సహజమని ఓడిన వారు తప్పులు సరిచేసుకొని మరో మ్యాచ్‌లో గెలవడానికి ప్రయత్నించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు. డ్రగ్స్, గంజాయికి మత్తుకు యువత బలికావద్దని సూచించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సీఎం ఈగల్ టీంను (Eagle Team) ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ప్రభుత్వం స్పోర్ట్స్ కాంప్లెక్స్ మంజూరు చేసిందని, 10 ఎకరాల్లో మూడేళ్ల కాలంలో కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి హామీ ఇచ్చారు.
MLA Bhupathi Reddy | డిచ్‌పల్లి విలేజ్ జట్టు విజయం
క్రికెట్ టోర్నమెంట్లో డిచ్‌పల్లి విలేజ్ జట్టు విన్నర్‌గా నిలవగా రన్నర్‌గా దేవ్ నగర్ జట్టు నిలిచింది. ఈ సందర్భంగా జట్లకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి ట్రోపీలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్, ప్రముఖ వ్యాపారవేత్త గాదె కృష్ణ, క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ఛైర్మన్ బి.వినోద్, టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి చింతల గంగాదాస్, ప్రముఖ వైద్యులు దీపక్ రాథోడ్, వనిత, జమాల్పూర్ రాజశేఖర్, ఆర్అండ్బీ విశ్రాంత ఈఈ శ్రీమన్నారాయణ, కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్, వాసుబాబు, శాంసన్, గడీల రాములు, నడిపల్లి తండా సర్పంచ్ పవార్ శాంతిలాల్, టోర్నీ నిర్వాహకులు జె నరేష్, సాజిద్, మెరుగు నాగరాజు, మధుసూధన్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.