56
అక్షరటుడే, బోధన్ : CM Cup | క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. సీఎం కప్ (CM Cup) సందర్భంగా బోధన్ ఎంపీడీవో కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు క్రీడాకారులు కాగడాల ర్యాలీ నిర్వహించారు.
CM Cup | ప్రారంభించిన ఏసీపీ..
ర్యాలీని ప్రారంభించిన ఏసీపీ శ్రీనివాస్ (ACP Srinivas) అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు, యువకులు ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం సాధించి జాతీయస్థాయిలో ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. ప్రతిఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో టౌన్ సీఐ వెంకటనారాయణ, ఎంపీడీవో శంకర్ నాయక్, వివిధ గ్రామాల పంచాయతీ సెక్రెటరీలు, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.