అక్షరటుడే, ఇందూరు: Youth Congress | రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, వనపర్తి జిల్లా అధ్యక్షుడు శివ సేనా రెడ్డి (Wanaparthy District President Shiv Sena Reddy) జన్మదినాన్ని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా నిర్వహించారు.
హమాల్వాడీ ఆలయం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విక్కీ యాదవ్ (Vicky Yadav) ఆధ్వర్యంలో గురువారం పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నరేందర్ గౌడ్, నగర ఉపాధ్యక్షుడు శుభం, నార్త్ మండల అధ్యక్షుడు దినేష్, జనార్దన్,ఈశ్వర్, గట్ల నరేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
