Homeజిల్లాలుజగిత్యాలMP Arvind | రోళ్లవాగు ప్రాజెక్ట్​కు అనుమతులు వేగవంతం చేయండి.. కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ...

MP Arvind | రోళ్లవాగు ప్రాజెక్ట్​కు అనుమతులు వేగవంతం చేయండి.. కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్​

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో గల రోళ్లవాగు ప్రాజెక్టుకు సంబంధించి అనుమతుల విషయంలో వేగవంతం చేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి​  కోరారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : MP Arvind | జగిత్యాల జిల్లా (Jagtial District) బీర్పూర్ మండలంలో గల రోళ్లవాగు ప్రాజెక్టుకు సంబంధించి అనుమతుల విషయంలో వేగవంతం చేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి​  కోరారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ (Forest Minister Bhupender Yadav)​ను కలిసి విజ్ఞప్తి చేశారు.

అనుమతుల విషయంలో చొరవ తీసుకోవాలని ఎంపీ అర్వింద్​ను ఇటీవల జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్ కుమార్ (MLA Dr. Sanjay Kumar) కోరారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో ఎంపీ కలిసి విన్నవించారు. అంతేకాకుండా జగిత్యాల అర్బన్ మండలంలో అర్బన్ ఫారెస్ట్​ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నగర్ వన్ యోజన (Nagar One Yojana) కింద రూ. రెండు కోట్లు మంజూరు చేసింది.

అయితే ఇందులో ఇదివరకే రూ. 1.4 కోట్ల రూపాయలు విడుదల కాగా.. 60 లక్షల రూపాయలు విడుదల కావాల్సి ఉండగా.. వాటిని తక్షణమే విడుదల చేయాలని కోరారు. సమస్యలను సావధానంగా విన్న మంత్రి, త్వరతగతిన పరిష్కరించి నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఎంపీ అర్వింద్ ధన్యవాదాలు తెలిపారు.

Must Read
Related News