అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో (Zilla Parishad Girls High School) మండల స్థాయి ఇంగ్లిష్ టాలెంట్ టెస్ట్‌ను నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బా విద్యాలయాలకు (Kasturba Vidyalayam) చెందిన విద్యార్థులకు రాత పరీక్షతో పాటు ఉపన్యాస పోటీలు నిర్వహించారు.
విజేతలకు మండల విద్యాధికారి రాజులు (Mandal Education Officer Rajulu), స్థానిక బాలికల పాఠశాల హెచ్ఎం నర్సింలు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఇంగ్లిష్ ఫోరం ఎల్లారెడ్డి మండల శాఖ (Yellareddy mandal department) బాధ్యులు వెంకటరమణ, ఉపాధ్యాయులు రామకృష్ణ, రమేశ్, విఠల్, మాన్య, సృజన్, ప్రభాకర్, మాధవి, వనజ, అనిత తదితరులు పాల్గొన్నారు.
