HomeతెలంగాణAtla Bathukamma | ఐదో రోజు అట్ల బతుకమ్మ.. ప్రధాన నైవేద్యం ఏమిటో తెలుసా..

Atla Bathukamma | ఐదో రోజు అట్ల బతుకమ్మ.. ప్రధాన నైవేద్యం ఏమిటో తెలుసా..

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Atla Bathukamma : తెలంగాణ సంస్కృతి Telangana culture, సంప్రదాయాల traditions కు అద్దం పట్టే గొప్ప పండుగ బతుకమ్మ. తెలంగాణ ఆడపడుచులు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించుకునే ఈ పూల పండుగ.. వారి జీవితంలో ఒక భాగం.

ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, తెలంగాణ ఆత్మగౌరవానికి, జీవన విధానానికి ప్రతీక. ఈ తొమ్మిది రోజుల్లో.. ప్రతిరోజూ ఒక్కో పేరుతో బతుకమ్మను పూజిస్తారు.

మొదటి రోజు ఎంగిలిపువ్వు బతుకమ్మతో మొదలై.. ఇప్పటివరకు అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ వేడుకలు ఘనంగా ముగిశాయి.

Atla Bathukamma : ఐదు పొరలుగా..

ఐదో రోజు అట్ల బతుకమ్మగా నిర్వహించుకుంటారు. ఈ రోజు తంగేడు, గునుగు, చామంతి, మందార, గుమ్మడి వంటి పూలతో ఐదు పొరలుగా బతుకమ్మను అందంగా అలంకరిస్తారు.

ఈ రోజు ప్రత్యేకంగా పిండితో చేసిన అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. సాయంత్రం, మహిళలందరూ కలిసి బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ, నృత్యం చేసి, అనంతరం నీటిలో నిమజ్జనం చేస్తారు.

ఆ తర్వాత అందరూ కలిసి ప్రసాదం స్వీకరించి, ఆనందంగా గడుపుతారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిని, సామరస్యాన్ని ప్రతిబింబించే ఒక అద్భుతమైన వేడుక.