అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Terror Attack | జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ pahalgam లో పర్యాటకులపై ఉగ్రవాదులు terrorists దాడి చేసి 28 మందిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ దాడితో దేశం మొత్తం ఉలికిపడింది. ముఖ్యంగా జమ్ము కశ్మీర్లో ఉన్న పర్యాటకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరిన్ని దాడులకు అవకాశం ఉందని కేంద్ర నిఘా బృందాలు Central Intelligence Agencies హెచ్చరించడంతో అక్కడి నుంచి పర్యాటకులు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో రైల్వే శాఖ Railway Department పర్యాటకుల tourists కోసం ప్రత్యేక రైలు special train నడుపుతోంది.
కశ్మీర్లో చిక్కుకున్న పర్యాటకులు ఎలాగైనా అక్కడి నుంచి వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే విమానాల్లో రద్దీ నేపథ్యంలో టికెట్ రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో రైల్వేశాఖ సెకండ్ క్లాస్ రిజర్వేషన్ లేని ప్రత్యేక రైలును జమ్మూ డివిజన్లోని కాత్రా katra నుంచి ఢిల్లీ Delhiకి నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక రైలు గురువారం మధ్యాహ్నం 1.30గంటలకు కాత్రా నుంచి బయలు దేరింది.
రైల్వేలు పర్యాటకులకు సహాయం కోసం హెల్ప్ డెస్క్ Help Deskలను సైతం ఏర్పాటు చేశాయి. రైలు షెడ్యూల్‌లు, ప్రయాణీకుల సేవల కోసం జమ్మూ తావి, కాట్రా స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. జమ్మూ తావి హెల్ప్‌లైన్ నంబర్ 0191-2470116. కాట్రా, ఉధంపూర్‌లోని పర్యాటకులు సాయం కోసం 01991-234876 , 7717306616 ఈ నంబర్లకు ఫోన్ చేయొచ్చు.