అక్షరటుడే, వెబ్‌డెస్క్: Election Commission | రాష్ట్రంలో త్వరలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) (Special Integrated Revision) నిర్వహించనున్నట్టు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (Chief Election Commissioner Gyanesh Kumar) తెలిపారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో పర్యటించారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీహార్‌లో ఈ ప్రక్రియ పూర్తయింది. పశ్చిమ బెంగాల్లో (West Bengal) సైతం 58 లక్షల ఓట్లను తొలగించారు. డ్రాఫ్ట్ జాబితాను ప్రచురించారు. ఎస్ఐఆర్పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. ఎన్నికల సంఘం ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ వెల్లడించారు.
Election Commission | విజయవంతం చేయాలి
తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం రవీంద్ర భారతిలో బీఎల్‍వోలతో సమావేశం నిర్వహించారు. బీహార్‌లో బీఎల్వోలు ఈ ప్రక్రియను విజయవంతంగా చేశారన్నారు. నెక్స్ట్ తెలంగాణలో ఈ ప్రక్రియ చేపడుతామన్నారు. తెలంగాణలో సగటున 930 మంది ఓటర్లు ఒక బీఎల్వో పరిధికిలోకి వస్తారని చెప్పారు.
దేశంలోని 12 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ ప్రక్రియ నడుస్తోందన్నారు. మిగతా రాష్ట్రాల్లో సైతం త్వరలో చేపడుతామని స్పష్టం చేవారు. రాజ్యాంగానికి అతిపెద్ద సైనికుడు బూత్ లెవెల్ ఆఫీసర్ అని ఆయన కొనియాడారు. కాగా అంతకు ముందు ఆయనను పలువురు అధికారులు కలిశారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) సీఈసీని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.