అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sankranti festival | సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. దీంతో పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న ప్రజలు స్వగ్రామాల బాట పట్టారు. దీంతో రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో (RTC buses) భారీగా రద్దీ నెలకొంది.
సంకాత్రి పండుగ (Sankranthi festival) రద్దీని దృష్టిలో ఉంచుకుని 6,431 ప్రత్యేక బస్సులను (special buses) నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. శనివారం నుంచి పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో అప్పటి నుంచి రద్దీ అధికం కానుంది. ప్రస్తుతం నిత్యం బస్టాండ్లు రద్దీగా ఉంటున్నాయి. ఈ క్రమంలో రాష్టవ్యాప్తంగా ఆయా బస్ డిపోల ఆశ్వర్యంలో స్పెషల్ బస్సులు ఈ నెల 9 నుంచి 19 వరకు నడవనున్నాయి.
Sankranti festival | 50శాతం ఛార్జీల పెంపు
ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ప్రకటన చేశారు. ఈ నెల 9 నుంచి 19 వరకు ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉంటాయన్నారు. అయితే సాధారణ బస్సుల్లో మాములే రేట్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. మహాలక్ష్మి పథకం కింద సంక్రాంతి సమయంలో కూడా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం యథావిధిగా కొనసాగుతుంది.