Supreme Court | OTT, సోషల్‌ మీడియాలో అశ్లీల కంటెంట్‌పై స్పందించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న అశ్లీల కంటెంట్‌ను కట్టడి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రం సహా పలు ఓటీటీ OTT, సామాజిక మాధ్యమాల్ల social media ప్లాట్‌ఫామ్‌ల platforms కు దేశ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. జస్టిస్ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్ అగస్టీన్‌ జార్జ్ మసిహ్‌ Justice BR Gavai and Justice Augustine George […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న అశ్లీల కంటెంట్‌ను కట్టడి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రం సహా పలు ఓటీటీ OTT, సామాజిక మాధ్యమాల్ల social media ప్లాట్‌ఫామ్‌ల platforms కు దేశ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

జస్టిస్ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్ అగస్టీన్‌ జార్జ్ మసిహ్‌ Justice BR Gavai and Justice Augustine George Masihతో కూడిన ధర్మాసనం నోటీసులిచ్చింది. ఓటీటీ, సామాజిక మాధ్యమాల్లో లైంగిక అసభ్యకరమైన కంటెంట్‌ను నిషేధించేందుకు నేషనల్ కంటెంట్‌ కంట్రోల్‌ అథారిటీని ఏర్పాటు చేసి మార్గదర్శకాలు జారీ చేయాలని ఐదుగురు పిటిషనర్లు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే దీనిపై సరైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు ఇప్పటికే ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్నింటిని అమలు చేస్తామని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా Solicitor General Tushar Mehta వివరణ ఇచ్చారు.

విచారణ సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి లైంగిక అసభ్యకరమైన కంటెంట్‌ కారణంగా పిల్లలు, యువతతో పాటు పెద్దల ఆలోచనలు కూడా కలుషితం అవుతాయనే అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. ఇది వికృతమైన, అసహజమైన లైంగిక ధోరణులకు దారితీస్తుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

దేశంలో నేరాల రేటు పెరిగే ప్రమాదం ఉందని ధర్మాసనం హెచ్చరించింది. విచారణ సమయంలో పరిపాలన, కార్యనిర్వాహక వ్యవహారాల పరిధిలోని ఒక ముఖ్యమైన సమస్యను పిటిషనర్‌ లేవనెత్తగా.. దీనిపై జస్టిస్ బీఆర్‌ గవాయ్‌ స్పందించారు. ఇప్పటికే పరిపాలన, కార్యనిర్వాహక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నామని తమపై ఆరోపణలు వస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...